ఉరేసుకొని కానిస్టేబుల్ బలవన్మరణం
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల శివారులో కానిస్టేబుల్ సైదులు (30) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తిరుమేలేశుని గుట్ట సమీపలంలోని ఓ వెంచర్లో చెట్టుకు కానిస్టేబుల్ ఉరిసేకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతని స్వస్థలం నల్లగొండ దిండి మండలం ఖానాపూర్ విలేజ్, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.