కెసిఆర్ చిత్ర‌పటానికి పాలాభిషేకం

సేలూన్ల‌కు క‌రెంటు ఫ్రీపై నాయిబ్ర‌హ్మ‌ణుల హ‌ర్షం

మంచిర్యాల‌: రాష్ట్రంలోని రజక, నాయీబ్రాహ్మణులకు సంబంధించిన క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్తు అందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణ‌యంపై రాష్ట్రంలోని నాయిబ్రాహ్మ‌ణులు, ర‌జ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సెలూన్ షాపులకు G.O.Ms.No252/B/218, ద్వార 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సదుపాయాన్ని కలిగించినందుకు గాను సోమ‌వారం మంచిర్యాల ఐబి చౌరస్తాలో లో తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు విష్ణు భక్తుల సదానందం ఆధ్వ‌ర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ నాయిబ్రాహ్మణుల క‌ష్టాల‌ను గుర్తించి సెలూన్ షాపుల‌కు ఉచిత విద్యుత్ క‌ల్పిస్తూ ఆదేశాల‌ను జారీచేయ‌డం ప‌ట్ల కృతజ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే పేద నాయిబ్రాహ్మ‌ణుల‌కు రుణాలను అంద‌జేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో ప‌ట్ట‌ణ నాయిబ్ర‌హ్మ‌ణుల వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి, నాయి బ్రాహ్మణ సభ్యులు స్వామి ,ముత్తయ్య, రామ్, చందర్ ,బాపు, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

త‌ప్ప‌క చ‌ద‌వండి: సెలూన్లకు ఉచిత విద్యుత్‌

Leave A Reply

Your email address will not be published.