Mandapeta: తెలుగుదేశం హయాంలో పార్టీలకు అతీతంగా పథకాలు: ఎమ్మెల్యే వేగుళ్ల

మండపేట (CLiC2NEWS): ఇప్పుడున్న వైసీపీ స‌ర్కార్ సంక్షేమ పథకాలు అందించే విషయంలో అంతా పక్షపాత దోరణి అవలంభిస్తోందని.. అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా పథకాలు అమలు జరిపే వారమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. బుధవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మండల సమావేశం జరిగింది. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పధకాలు అందించే వారమని, కాని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది అనేది ఎక్కడ కనపడటం లేదని ఒక్క కట్టడం కూడా చూడలేదని అన్నారు. తాపేశ్వరం ద్వారపూడి రోడ్డు మొదటి స్ధానంలో ఉందని అన్నారు. నిత్యం ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలు సంభవిస్తున్నా ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. రోజూ పత్రికల ద్వారా సమస్యలను తెలియజేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ద్వారపూడి రోడ్డుకు రూ. 25 కోట్లు నిధులు మూలుగుతున్న రోడ్డు నిర్మాణం చేపట్టక పోవడం చాలా దారుణం అన్నారు. ఏదిఏమైనా టిడిపి కార్యక్తలందరూ కలసికట్టుగా వైకాపా ప్రభుత్వ ఆగడాలను ఎండకట్టాలని ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. అనంతరం జెడ్ మేడపాడులో టీడీపీ నుండి గెలుపొందిన సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, తాపేశ్వరం సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వర శ్రీనివాస్, కేశవరం సర్పంచ్ పెదపాటి సత్యనారాయణమూర్తి లను, వార్డు మెంబర్లను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే , తెలుగుదేశంపార్టీ నాయకులు కలసి దుశ్శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించారు. అనంతరం మండపేట మండలంలో కరోనాతో చనిపోయిన టిడిపి కార్యకర్తలకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి ఉడతా ప్రభాకరరావు, వాసంశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గోసాల సుజాత ప్రసాద్, గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు, తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.