India Corona: కొత్తగా 26,115 కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 26,115 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కు చేరింది.
- తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 252 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
- తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మరణాల సంఖ్య 4,45,385కు చేరింది.
- తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 34,469 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
- తాజా రికవరీలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కు చేరింది.
- ప్రస్తుతం దేశంలో 3,09,575 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- ఇక దేశంలో ఇప్పటి వరకు 81.85 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
India reports 26,115 new #COVID19 cases, 252 deaths & 34,469 recoveries in last 24 hrs, says Health Ministry
Total Cases: 3,35,04,534
Total Active cases: 3,09,575
Total Recoveries: 3,27,49,574
Total Death toll: 4,45,385Total vaccination: 81,85,13,827 (96,46,778 in 24 hrs) pic.twitter.com/CzL8Ugj7lq
— ANI (@ANI) September 21, 2021