India Corona: కొత్త‌గా 26,115 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 26,115 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కు చేరింది.
  • తాజాగా గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 252 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.
  • తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మ‌ర‌ణాల సంఖ్య 4,45,385కు చేరింది.
  • తాజాగా గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 34,469 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు తెలిపింది.
  • తాజా రిక‌వ‌రీల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,04,534కు చేరింది.
  • ప్ర‌స్తుతం దేశంలో 3,09,575 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • ఇక దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 81.85 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.