ఆర్టీసీపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్ (CLIC2NEWS): టీఎస్ ఆర్టీసీపై సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతోంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై కరోనా, పెరిగిన డీజిల్ రేట్ల భారం నేపథ్యంలో.. తిరిగి పుంజుకునేందుకు అవలంభించాల్సిన విధివిధానాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.