kaikala satyanarayana: కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత
హైదరాబాద్ (CLiC2NEWS): సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారి పడ్డారు. కిందపడటం వల్ల నొప్పులు కాస్త ఎక్కువగా ఉండటంతో ఆయన్ని శనివారం రాత్రి కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు.