TS: మంత్రులు, పార్టీ నేత‌ల‌తో సిఎం కెసిఆర్ స‌మావేశం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ‌తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రులు, పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నిక‌ల‌కు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విష‌యంపై చ‌ర్చించ‌నున్నారు. మ‌రికాసేప‌ట్లో సిఎం మీడియాతో మాట్లాడ‌నున్నారు. సిఎం స్వ‌యంగా ఎమ్మెల్సి అభ్య‌ర్థుల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. హైదరాబాద్‌ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సి ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైన‌ విష‌యం తెలిసిన‌దే.

Leave A Reply

Your email address will not be published.