దేశంలో 101కి చేరిన ఒమిక్రాన్ కేసులు
అనవసర ప్రయాణాలు వద్దని కేంద్రం హెచ్చరిక
ఢిల్లి (CLiC2NEWS): దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 11 రాష్ట్రాలకు వ్యాపించింది. మొత్తం 101 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్థారణయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది.
డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికి 91 దేశాలకు వ్యాపించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. పండగలు, పార్టీలలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం తెలిపింది. కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరగా జరుపుకోవాలని, ప్రయాణాలను సైతం కొంత కాలం వాయిదా వేస్తే మంచిదని సూచించారు.