రెవెన్యూ పెంపు కోసం రెండు నెల‌లు జ‌ల‌మండ‌లి స్పెష‌ల్ డ్రైవ్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌గ‌రంలోని జ‌ల‌మండ‌లి కేంద్రంలో జ‌ల‌మండ‌లి ఎండి దానం కిశోర్ రెవెన్యూపై స‌మీక్ష నిర్వ‌హించారు. న‌ల్లా బిల్లుల‌ బ‌కాయిల వ‌సూలు కోసం రెండు నెల‌ల పాటు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకానికి అర్హులు కాని, ఉచిత నీటి ప‌థ‌కానికి నమోదు చేసుకోని వారి నుంచి నల్లా బిల్లులను, బకాయిలను వసూలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందుకు గానూ ఒక్కో స‌బ్ డివిజ‌న్‌కు 5 గురు చొప్పున రెండు నెల‌ల కోసం తాత్కాలికంగా 200 మంది మీట‌ర్ రీడ‌ర్ల‌ను అద‌నంగా నియ‌మిస్తున్న‌ట్లు చెప్పారు. అలాగే, ఒక్కో స‌బ్‌ డివిజ‌న్‌కు ఒక డిస్‌క‌నెక్ష‌న్ గ్యాంగ్ కూడా ఉంటుంద‌న్నారు. వీరు బ‌కాయిలు చెల్లించ‌ని వినియోగ‌దారుల న‌ల్లా క‌నెక్ష‌న్ల‌ను తొల‌గిస్తార‌ని తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.