కొవిడ్ కొత్త వేరియంట్లపై ఆందోళన వద్దు: మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్ (CLiC2NEWS): దేశంలో కారోనా కొత్త వేరియంట్ బిఎఫ్.7 కేసులు వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమయింది. కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం వైద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ అందోళన చెందవద్దని..అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కొవిడ్ టీకా బూస్టర్ డోసు వేయించుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.