తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో 17 పిజి కోర్సులు
రాష్ట్రంలో ఉన్న ఎనిమిది విశ్వ విద్యాలయాల్లో పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉన్నత విద్యా మండలి ఉమ్మడి పిజి ప్రవేశ పరీక్ష (TS CPGET) నోటిఫికేషన్ విడుదలైంది. దరకాస్తులను వచ్చే నెల 17వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ఆగస్టు మొదటి వారంలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ర్యాంకుల ఆధారంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుతో పాటు వసతి గృహం అందుబాటులో ఉంటుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంది. డిచ్పల్లి ప్రధాన క్యాంపస్ , సారంగాపూర్ లోని ఎడ్యుకేషన్, భిక్కనూర్లోని దక్షిణ ప్రాంగణాల్లో 27 కోర్సులు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. వీటిలో రెండేళ్ల పిజితో పాటు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులున్నాయి.
డిచ్పల్లి ప్రధాన క్యాంపస్లో ఎంఎ తెలుగు, హింది, ఇంగ్లిష్, , ఉర్దూ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , మాస్ కమ్యూనికేషన్, అయిదేళ్ల అప్లైడ్ ఎకనామిక్స్ , అయిదేళ్ల ఐఎంబిఎ, ఎంకామ్ , ఎంఎస్సి మ్యాథ్స్, బోటని, కెమిస్ట్రి (స్పెషలైజేషన్, ఆర్గానిక్ కెమిస్ట్రి), అయిదేళ్ల ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రి, అప్లైడ్ స్టాటిటిక్స్, బయో టెక్నాలజి కోర్సులు అన్నాయి.
భిక్కనూర్ దక్షిణ ప్రాంగణంలో ఎంఎ హిస్టరి, తెలుగు (కంపారిటివ్ లిటరేచర్), పొలిటికల్ సైన్స్, ఎంఎస్ డబ్ల్యూ (సోషల్ వర్క్), ఎంఎస్సి కెమిస్ట్రి, ఫిజిక్స్ , జియో ఇన్ఫర్మాటిక్స్ , జువాలజి కోర్సులు అందుబాటులో ఉన్నవి.
