క‌మ‌ల్‌కు ఆస్కార్ ఫైన‌ల్ ఎంపిక ప్ర‌క్రియ‌లో ఓటువేసే అవ‌కాశం..

Kamalhasan: హీరో క‌మ‌ల్ హాస‌న్‌కు అస్కార్ అకాడ‌మీలోకి ఆహ్వానం ల‌భించింది. ఆస్కార్ ఓటింగ్ ప్ర‌క్రియ‌లో ఆయ‌న భాగం కానున్నారు. ఈ ఏడాదిగాను ఆస్కార్ అకాడ‌మీలో స్థానం పొందిన వారి జాబితాను ది అకాడ‌మి ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుద‌ల చేసింది. క‌మ‌ల్ హాస‌న్ తోపాటు ఆయుష్మాన్ ఖురానా, ద‌ర్శ‌కురాలు పాయ‌ల్ కపాడియా , భార‌తీయ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మాక్సిమా బ‌సు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆస్కార్‌కు నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైన‌ల్ ఎంపిక ప్ర‌క్రియ‌లో వీరికి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించ‌నుంది.

ఆస్కార్ అకాడ‌మీలో ఈ ఏడాది కొత్త‌గా 534 మంది స‌భ్యుల‌కు ఆహ్వానం ల‌భించింది. వీరిలో 41శాతం మ‌హిళ‌లే ఉన్న‌ట్లు స‌మాచాం. 19 ఇత‌ర విభాగాల్లోని న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత‌ల‌ను ది అకాడ‌మి ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానించింది.

 

Leave A Reply

Your email address will not be published.