‘కన్నప్ప’ చిత్రంపై మంచు మనోజ్ రివ్యూ..
హైదరాబాద్ (CLiC2NEWS): తాను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చిందని కన్నప్ప చిత్రంపై మంచు మనోజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుందని.. తాను అనుకున్న దానికంటే వెయ్యిరెట్టు బాగా వచ్చిందన్నారు. సినిమాలో ప్రభాస్ వచ్చిన తర్వాత మరో స్థాయిలో ఉందని.. ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
గత కొంతకాలంగా మంచు కుటుంబంలో నెలకొన్న పరిస్తితుతుల గురించి తెలిసిన వషయమే. కన్నప్ప చిత్రం విడుదల సందర్భంగా గురవారం మనోజ్ ఎక్స్‌లో పోస్టుపెట్టారు. కన్నప్ప టీమ్‌కు ఆల్ ద బెస్ట్ తెలిపారు.