Murudeshwar: రెండో అతిపెద్ద శివుడి విగ్రహం
కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర్ శివుని విగ్రహం
మురుడేశ్వర్ (CLiC2NEWS): కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వర్ లో గల శివుని విగ్రహం అతి ఎత్తైనది. ఈ శివుని విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతి ఎత్తైన విగ్రహం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ఆలయ గోపురం భారత దేశంలోనే అతిపెద్ద రెండవ గోపురం.
ఈ విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఇది అరేబియా సముద్రం ఒడ్డున గల కొండపై ఉంది. దీనిని 2006లో నిర్మించారు. సూర్యరశ్మి విగ్రహం ముఖంపై పడే విధంగా నిర్మించడం ఈ విగ్రహం ప్రత్యేకత..
కాగా ఇక్కడి అరేబియా సముద్రంలోని బీచ్ చూడడానికి కనువింపుగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గోపురం పైనుంచి చూస్తే చాలా విశాలమైన సముద్రంతో పాటు, శివుని విగ్రహం ఆకట్టుకునే విధంగా ఉంటుంది…
హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్ వెళ్లాలంటే…
రోడ్డు మార్గం:
హైదరాబాద్ నుంచి సుమారు 675 కి.మీ
ప్రయాణ సమయం: సుమారు 12-14 గంటలు
బెస్ట్ రూట్: Hyderabad → Raichur → Bagalkot → Hubli → Sirsi → Murudeshwar
స్వంత కార్ లేదా టాక్సీ ద్వారా లేదా కర్ణాటక RTC/ప్రైవేట్ బస్సులు ద్వారా ప్రయాణించవచ్చు.
రైలు మార్గం:
హైదరాబాద్ నుంచి Kundapura / Bhatkal వరకు ట్రైన్ లో వెళ్లి అక్క డి నుంచి మురుడేశ్వర్కు బస్సు లేదా టాక్సీ (సుమారు 30-40 కిమీ)లో వెళ్లాలి.
లేదా..
హైదరాబాద్ నుంచి మంగళూరు ట్రైన్ లో వెళ్లి అక్కడ ఇనుంచి Murudeshwar కి లోకల్ ట్రైన్ లేదా బస్సు/కారులో వెళ్లవచ్చు (సుమారు 150 కిమీ)
విమానం:
హైదరాబాద్ టు మంగళూరు కు రెగ్యులర్ విమాన సర్వీసులు ఉన్నాయి.
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మురుడేశ్వర్కు సుమారు 150 కి.మీ (3-4 గంటలు)
-కొడకల గోవర్ధన్ ముదిరాజ్
సీనియర్ జర్నలిస్ట్
సెల్: +91 90599 99259
తప్పకచదవండి: Ramavaram: ఆయన బతకంతా తెలంగాణకే..









[…] Murudeshwar: రెండో అతిపెద్ద శివుడి విగ్రహం […]
[…] చదవండి: Murudeshwar: రెండో అతిపెద్ద శివుడి […]