అమెరికాలో హైదరాబాద్ విద్యార్ధి మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): ఎన్నో ఆశలు, కలలతో ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన శ్రీజా వర్మ మృతి చెందింది. శ్రీజా వర్మ తల్లిదండ్రులు సిద్దిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందినవారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ చౌరస్తా సమీపంలోని శ్రీకృష్ణా నగర్‌లో నివాసముంటున్నారు. శ్రీజా వర్మకు ఓ సోదరి కూడా ఉన్నారు. ఆమె కూడా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమె వెళ్లి 20 రోజులే కావస్తున్నట్లు సమాచారం.
శ్రీజా వర్మ సోమవారం రాత్రి భోజనం చేసేందుకు కారులో రెస్టారెంట్‌కు వెళ్ళింది. తిరిగి తాను ఉండే అపార్ట్‌మెంట్‌కు వస్తున్న క్రమంలో తాను ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో శ్రీజావర్మతో పాటు ఆమె స్నేహితురాలు కూడా కారులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏ భావోద్వేగాన్నైనా పలికించగల నటుడు ఎన్‌టిఆర్: త్రివిక్రమ్
[…] […]