ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో పోస్టులు 

ఇంజినీరింగ్ డిగ్రీ , ఎంటెక్‌/  పిహెచ్‌డి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు అర్హులు. ఫిక్స్‌డ్ ట‌ర్మ్ ప్రాతిప‌దిక‌న 19 పోస్టుల‌ను ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ , న‌వ‌రత్న కంపెనీ, న్యూఢిల్లీ భ‌ర్తీ చేయ‌నున్న‌ది. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 18వ తేదీ లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

పోస్టుల వివ‌రాలు: 

సీనియ‌ర్ మేనేజ‌ర్ – 6

మేనేజ‌ర్ – 6

డిప్యూటి మేనేజ‌ర్ -3

ఇంజినీర్ -1

జూనియ‌ర్ సెక్ర‌ట‌రీ -3

అక‌డ‌మిక్ డిగ్రీ (బిఇ/  బిటెక్ /  బిఎస్‌సి) , ఎంటెక్ /  పిహెచ్‌డి  తో పాటు టెక్నిక‌ల్ అర్హ‌త‌లు కూడా ఉండాలి. షార్ట్ హ్యాండ్/   టైపింగ్ నైపుణ్యం , ఉద్యోగానుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఉంటుంది.

షార్ట్‌లిస్టింగ్, స్కిల్ టెస్ట్ , ఇంట‌ర్వ్యూల ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది.

 

అసోసియేట్ సీనియ‌ర్ మేనేజ‌ర్

పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు వేత‌నం నెల‌కు రూ. 90,000 – రూ. 2,40,000

ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి వ‌య‌స్సు 40 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

 

మేనేజ‌ర్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 80,000- రూ. 2,20,000

అభ్య‌ర్థుల వ‌య‌స్సు 36 ఏళ్లు ఉండాలి.

 

డిప్యూటి మేనేజ‌ర్ కు జీతం నెల‌కు రూ. 70,000- రూ. 2,00,000

 జూనియ‌ర్ సెక్ర‌ట‌రీ ఉద్యోగాల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 29,000 – రూ.1,20,000

పై రెండు పోస్టుల‌కు అభ్య‌ర్థుల వ‌య‌స్సు 32 ఏళ్ల లోపు ఉండాలి.

 

ఇంజినీర్ పోస్టుల‌కు రూ. 60,000 – రూ. 1,80,000

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 28 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

 

భార‌త్‌లో తొలి టెస్లా కారు విక్ర‌యం..

Leave A Reply

Your email address will not be published.