ఓవర్సీస్‌లో బ్లాక్‌బస్టర్ వసూళ్లు!
హైదరాబాద్ (CLiC2NEWS): తెలగు రాష్ట్రాలలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఇప్పుడు ఒజి (TheyCallHim OG)మేనియా కినిపిస్తోంది. దసరా ముందే వచ్చేసినట్టుంది పవన్ ఫ్యాన్స్‌కు. ఇది నిజంగానే పవర్‌స్టార్ అభిమానులకు బిగ్ ఫెస్టివల్. పవన్ కట్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒజి చిత్రంలో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీనికి తోడు పాజిటివ్ రేటింగ్స్ కూడా సినిమాకు కలిసొచ్చింది.
ఈ క్రమంలో అంతటా ఒజి వసూళ్ల గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓవర్సీస్‌లో ఓజి కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కేలవలం ఓవర్సీస్ ప్రీమియర్స్ లో 3 మిలియన్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.
విడుదల కు ముందు ఉత్తర అమెరికాలో పలు అంశాలు చర్చనీయాంశాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఒజి సినిమా షోలు కాన్సిల్ చేయడం… మరో ప్రొడక్షన్ సంస్థ దీన్ని తీసుకోవడం జరిగింది. దీంతో ఓవర్సీస్‌లో ప్రిమియర్స్ లో ఒజి కలెక్షన్లు ఎంత సాధించింది అనేది అభిమానుల్లోనే కాకుండా సామాన్యులకు కూడా ఆసక్తిగా మరింది. కాగా తాజాగా విదేశీ నిర్మాణ సంస్థ ప్రీమియర్స్ కలెక్షన్లపై అధికారిక పోస్టర్ విడుదల చేసింది.
ఉత్తర అమెరికాలో `ఒజి` (TheyCallHim OG ప్రిమియర్స్‌లో లో దాదాపు రూ. 26 కోట్లు (3 మిలియన్లు) పైగా వసూలు చేసిందని తెలిపింది. ఇప్పటి వరకు ఏ స్టార్ హీరోకు కూడా ఈ వసూళ్లు సాధించలేదని తెలిపింది. ఇది రికార్డు కలెక్షన్లు అని సంస్థ తెలుపడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Also Read: 26, 27 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వానలు!