బ్రహ్మకమలంలో దాగిన తత్త్వం
బ్రహ్మకమలం .. దివ్య పుష్పం..
హిమాలయాల గర్భంలో, మంచు ముద్దులో, నిశీధి నిశ్శబ్దంలో పూసే ఒక అపూర్వ పుష్పం ఉంది… అదే బ్రహ్మకమలం.
దీనిని దేవతలు దర్శించమని కోరుతారు, ఋషులు ధ్యానంలో దీని రూపాన్ని మనసారా ఆవాహన చేస్తారు.
ఎందుకంటే ఇది కేవలం పువ్వు కాదు.. తత్త్వం, జ్ఞానం, మోక్షం అనే మూడు మార్గాల సంకేతం. బ్రహ్మకమలం రాత్రి మాత్రమే పూస్తుంది.
చీకటి మధ్యలో వెలుగును ప్రసరించే ఆ క్షణం.. మన జీవితానికి అద్దం.మనసు చీకటితో నిండినపుడు, భక్తి వెలుగు వెలిగితే మనలోని బ్రహ్మకమలం పూస్తుంది.
అది ధ్యానానికి సూచిక, అది మౌనానికి మూర్తి. చూడండి, పూయగానే అది మెల్లగా పరిమళిస్తుంది, తెల్లవారక ముందే మూసుకుంటుంది.
అది మనకు చెప్పేసత్యం ఏమిటంటే…“జీవితం క్షణికం, కానీ ఆ క్షణంలోనే దైవం దర్శనమిస్తుంది.” దాని తెల్లని రేకులు పవిత్రతకు సూచన,
దాని సువాసన ఆత్మజ్ఞానానికి నిదర్శనం.
బ్రహ్మకమలం పూసిన చోట, ఆ ప్రదేశం క్షణానికే తీర్థక్షేత్రమవుతుంది. ఎందుకంటే అక్కడ దైవశక్తి ఆవహిస్తుంది. ఇదే పుష్పం బద్రీనాథుని పాదపద్మాల వద్ద పూస్తుంది,
కైలాసంలో శివుని మౌనంలో విరిసిపోతుంది.
బ్రహ్మకమలాన్ని చూడటం అంటే బ్రహ్మాన్ని తాకడం. అందుకే దీని దర్శనం శుభప్రదం, దీని వికాసం మోక్షప్రదం. మన మనసులోనూ ఇలాంటి బ్రహ్మకమలం పూసేలా చేసుకోవాలి.
అది భక్తితో, విశ్వాసంతో, మౌనంతో పూస్తుంది.
మనలోని అహంకారం చీకటిని తొలగించి, ఆత్మవెలుగు వెలిగితే
అప్పుడు మన హృదయంలో బ్రహ్మకమలం వికసిస్తుంది..
“బ్రహ్మకమలం బయట పూసేది ప్రకృతిలో,
కానీ దాని ప్రతిరూపం మన హృదయంలో పూయాలి..
అప్పుడు మనం జీవించేది కాదు, జ్ఞానోదయం పొందుతాం.
-ఎస్.వి.రమణా చార్య
సీనియర్ జర్నలిస్టు
సెల్: 98498 87086
Also Read: నైట్ నా భార్య నాగినిగా మారిపోతోంది…

[…] Also Read: బ్రహ్మకమలంలో దాగిన తత్త్వం […]