నైట్ నా భార్య నాగినిగా మారిపోతోంది…

క‌లెక్ట‌ర్ కు మొర‌పెట్టుకున్న భ‌ర్త‌...

సీతాపుర్ (CLiC2NEWS): ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. సీతాపూర్‌ జిల్లా ప‌రిధిలో క‌లెక్ట‌ర్‌కు వ‌చ్చిన ఫిర్యాదు చూసి ఒకింత ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. `స‌మాధాన్ దివ‌వ‌స్‌` (ప్ర‌జా ఫిర్యాదుల దినం)లో భాగం సితాపూర్ క‌లెక్ట‌ర్ ఫిర్యాదులు స్వీక‌రిస్తుండ‌గ ఓ వ్య‌క్తి త‌న భార్య చేస్తున్న వింత చేష్ట‌ల‌పై విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

మ‌హ‌మూదాబాద్ త‌హ‌సీల్ లోని లోధాసా గ్రామానికి చెందిన మెరాజ్ అనే వ్య‌క్త త‌న భార్య న‌సీమున్ రాత్రి పూట నాగినిగా మారిపోయి బుస కోడుతోందని.. దానితో ఆగ‌కుండా త‌న‌ను భెదిరిస్తూ భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తోందని ఫిర్యాదు చేశాడు.

ఇంత‌కు ముందు స్థానిక పోలీసుల‌కు తెలియ‌జేసిన ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో క‌లెక్ట‌ర్ వ‌ద్ద‌కు రావాల్సి వ‌చ్చింద‌ని విన్న‌వించుకున్నారు.

దాంతో క‌లెక్ట‌ర్ ఈ విష‌యాన్ని ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసులను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న జిల్లాలోనే కాండా అంత‌టా వ్యాపించి తీవ్ర చ‌ర్చానీయాంశంగా మారింది.

Also Read: ఘ‌నంగా సిరిమానోత్స‌వం!

1 Comment
  1. […] నైట్ నా భార్య నాగినిగా మారిపోతోంది&#823… […]

Leave A Reply

Your email address will not be published.