Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
హైదరాబాద్‌లో దారుణ ఘటన
హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మానగర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన రెండు సంవత్సరాల కవల పిల్లలను గొంతునులిమి చంపేసింది. అనంతరం తాను కూడా మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. ఈ దారుణ ఘటన బాలానగర్ ప్రాంతంలో పలువురిని కలచివేసింది.
విషయం తెలుసుకున్న బాలానర్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. తురాలి పేరు సాయి లక్ష్మీ. ఆమె ఏలూరు జిల్లా నూజివీడుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. బర్త అనిల్ కుమార్‌తో గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపైకేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
[…] […]
[…] […]