బాపట్ల లో లారీని ఢీకొన్న బైకు.. ఇద్దరు మృతి
బాపట్ల (CLiC2NEWS): బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక గడియార స్తంభంచౌరస్తా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న బైకు లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సిసి టివిలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Alsor Read: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: నారాయణఖేడ్ కు చెందిన నలుగురు మృతి
[…] […]