మరోసారి సునీల్తో సలోని!
కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్కు అందాల రాముడు, పూలరండు, మర్యాదరామన్న వంటి రెండు, మూడు తప్ప చెప్పుకునేంత విజయాలు లేకపోవడంతో మళ్లీ కమెడియన్గా మారిపోయాడు. సినిమాల్లో ఓ సినిమా సునీల్కు భారీ హిట్ అంటే మర్యాదరామన్య అనే చెబుతారు ఎవరైనా. ఈ సినిమాలో సునీల్ సరసన జోడీ కట్టిన హీరోయిన్ సలోని. ఈమెకు తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేదు. కాగా.. పదేళ్ల తర్వాత మరోసారి సునీల్, సలోని జంటగా నటించబోతున్నారని సమాచారం.
సినీ వర్గాల సమాచరం మేరకు సునీల్ హీరోగా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారక ప్రకటన ఏమీ లేకుండానే షూటింగ్ చకచక జరిగిపోతోందట. ఈ సినిమాలో సునీల్కి జోడీగా సలోని నటిస్తోందని తెలుస్తోంది.
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న’ సినిమా సునీల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది. ఈ సినిమాలో సునీల్కి జోడీగా సలోని నటించారు. వీరిద్దరి జంట ప్రేక్షకుల మదిలో బెస్ట్ పెయిర్గా నిలిచింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడదుల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లేక థియేటర్లు ఓపెన్ అవుతున్న కారణంగా.. ఓటీటీ విడుదల నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందనీ వార్తలొస్తున్నాయి.