ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌లో 714 పోస్టులు

714 Multi-Tasking posts in the Delhi Subordinate Services Selection Board..

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ‌య‌స్సు 18 నుండి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు లో 714 మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

కంప్యూట‌ర్ ఆధారిత ఫరీక్ష (టైర్‌-1) , డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది.

ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 18 వేల నుండి రూ.56,900 వ‌ర‌కు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 100 గా ఉంది. ఎస్‌సి/  ఎస్‌టి/  మ‌హిళ‌లు, దివ్యాంగులు/  ఎక్స్ స‌ర్వీస్‌మెన్ ల‌కు ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ జ‌న‌వ‌రి 15, 2026.

ఎక్సైజ్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ అండ్ ల‌గ్జ‌రీ ట్యాక్సెస్ డిపార్ట్‌మెంట్‌, లేబ‌ర్ , డ్ర‌గ్స్ కంట్రోల్‌, ఎన్‌సిసి, జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్,  అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ,  రిజిస్ట్రార్ కో ఆప‌రేటివ్ సొసైటిస్‌, లోకాయుక్త డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సాహిత్య క‌ళా ప‌రిష‌త్ మొద‌లైన విభాగాల్లో  వాటిలో ఖాళీలు క‌ల‌వు.

ప‌రీక్ష విధానం :

జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ రీజ‌నింగ్ ఎబిలిటి, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటి, హిందీ, ఇంగ్లిష్‌, లాంగ్వేజ్ ల నుండి 200 అబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వీటికి 200 మార్కులు ఉంటాయి.

 

TS: ఇంట‌ర్ ప‌రీక్షల కొత్త షెడ్యూల్‌..

Leave A Reply

Your email address will not be published.