‘హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లీ’..
మెగా డాటర్, మిసెస్ నిహారిక నేడు (శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో 28వ వసంతంలోకి అడుగుపెడుతున్న నిహారికకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు కావడంతో మరింత ప్రత్యేకంగా మారింది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వరుణ్‌తేజ్ చెల్లెలు నిహారికకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నిహా…నువ్వు ఇంత పెద్దదానివి అయ్యావంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు ఎప్పటికీ మాకు చిన్నపిల్లలాగే కనిపిస్తావు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచుతావు. నా జీవితంలో నువ్వు ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లీ’..అంటూ ఎంతో ప్రేమగా నిహారికకు పుట్టినరోజు విషెస్‌ను తెలియజేశారు
Nihaaaaaaa!!
I still can’t believe that you’re all grown up but you will always be my little girl..
You spread such happiness to everyone around you..
I’m so damn lucky to have you in my life!Happy birthday bangaru thalli!
😘😘😘@IamNiharikaK pic.twitter.com/ULw36mOFR4— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 18, 2020