పుత్తూరులో విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరేసి, కన్నతల్లి ఆత్మహత్య..
పుత్తూరు (CLiC2NEWS): వారిది ప్రేమ వివాహం.. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు పిల్లలు. ‘ఊరంతా అప్పులు చేసి, తీర్చలేనంటే.. నేనేం చేయాలి’ అంటూ.. లేఖ రాసి తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ కన్నతల్లి . ఈ ఘటన తిరుపతి జిల్లా పుత్తూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పద్మ, శివశంకర్.. పుత్తూరులో డిగ్రీ చదువుకునే రోజుల నుండి స్నేహితులు. వీరి పెళ్లికి కులాలు వేరు కావడంతో పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాదు, శివశంకర్ ఏ పని చేయకపోవడం కూడా కారణం. వీరు 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి లాస్య, తేజ ఇద్దరు కుమార్తెలు. ఇంటి ఖర్చులకు , పిల్లల స్కూల్ ఫీజులకు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. శివశంకర్ ఇంకా జులాయిగా తిరగడం, ఇంటి పోషణ పట్టించుకోక పోవడంతో రెండు రోజుల క్రితం కూడా పెద్ద మనుషులు సైతం శివశంకర్‌ను మందలించారు. దీంతో అతను కుటుంబాన్ని బాగా చూసుకుంటానని, ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. శనివారం బయటకు వెళ్లిన భర్తకు ఫోన్ చేసి డ్వాక్రా సంఘంలో అప్పు కట్టావా అని ప్రశ్నించగా.. కట్టలేదని చెప్పాడు.

భర్త సమాధానంతో మనస్థాపం చెందిన పద్మ లేఖ రాసి పిల్లలకు ఉరేసి, తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ‘తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తన జీవితం ఓ గుణపాఠం కావాలని లేఖలో తెలిపింది. ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తలో ఉండకూడదని కోరుకుంటుందో .. అటువంటి లక్షణాలు తన భర్తలోనే ఉన్నాయి, ఇది తాను కలలో కూడా ఊహించలేదు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నాకు పుట్టిన పిల్లలు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేనంటే.. నేనేం చేయాలి’ అంటూ లేఖ లో రాసింది. తాను చనిపోయిన తర్వాత ఎలాగూ మళ్లీ పెళ్లి చేసుకుంటావు. ఈ సారైనా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోమని శివశంకర్‌కు లేఖలో తెలిపింది.
Also Read: శీర్షిక: కళాకారులు (Folk artists)
Hi there! 🙂 My name is Larry, I’m a student studying Graduate
School from Sandvika, Norway.
The article is good and enjoyable. The site is useful and smooth.
What’s up, this weekend is fastidious designed for me,
because this moment i am reading this impressive informative piece of writing here at my house.