Montha Effect: ఇచ్ఛాపురంలో బాహుదా న‌ది ఉగ్ర‌రూపం

ఇచ్చాపురం (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్ప‌డిన మొంథా తుఫాన్ ప్ర‌భావంతో ఎపి వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ మొంథా ప్ర‌భావం ఒడిశాలోను కొన‌సాగుతోంది. భారీ వ‌ర్షాల‌కు ఒడిశాలోని భ‌గ‌ల‌టి నుంచి వ‌ర‌ద పోటెత్త‌డంతో బాహుదా న‌ది ఉగ్ర‌రూపం దాల్చింది.

దీని ఫ‌లితంగా శ్రీ‌కాకుళంలోని ఇచ్ఛాపురంలోని పాత వంతెన వ‌ద్ద శివాల‌యం నీట మునిగింది. జిల్లాల్లోని ప‌లు ప్రాంతాలు వ‌ర‌ద‌నీటిలో మునిగాయి. జ‌గ‌న్నాథ‌పురంలో ఇళ్ల‌లోనికి వ‌ర‌ద నీరు చుట్టుముట్టింది. దీని ప్ర‌భావంతో ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. డొంకూరు పాఠ‌శాల ప్రాంగ‌ణం చెరువులా మారింది.

Also Read: Montha Effect: ఉప్ప‌నుంత‌ల‌లో 20.8 సెం.మీ వ‌ర్షం

Leave A Reply

Your email address will not be published.