Montha Effect: ఉప్పనుంతలలో 20.8 సెం.మీ వర్షం
హైదరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం. మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా అమ్రాబాద్‌లో 19.7 సెం. మీ. వర్ష పాతం నమోదైంది.
అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపెల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మొంథా ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (బుధవారం) ఉదయం నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో బాగ్ లింగంపల్లి, బర్కత్ పుర, నారాయణగూడ, గాంధీనగర్, గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రో్డు, దోమలగూడలో వర్షం కురుస్తోంది.
ఈ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుకుంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
[…] Also Read: Montha Effect: ఉప్పనుంతలలో 20.8 సెం.మీ వర్షం […]