స్క్రాబ్ దుకాణంలో సిలిండ‌ర్ పేలి ముగ్గురు మృతి

విశాఖప‌ట్నం (CLiC2NEWS): విశాఖ న‌గ‌రంలోని ఓ దుకాణంలో గ్యాస్ సిలిండ‌ర్ పేలి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఫిషింగ్ హార్బ‌ర్ స‌మీపంలో ఉన్న స్క్రాబ్ దుకాణంలో వెల్డింగ్ చేసే సిలిండ‌ర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. మ‌ర‌ణించిన వారి మృత‌దేహాలు చెల్లాచెదురై గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రులు విశాఖ కెజిహెచ్‌కు త‌ర‌లించారు.

 

Also Read: అడ్డదారుల్లో ఉద్యోగాలు రావు: స‌జ్ట‌నార్‌

1 Comment
  1. […] Also Read: స్క్రాబ్ దుకాణంలో సిలిండ‌ర్ పేలి ముగ… […]

Leave A Reply

Your email address will not be published.