వేముల‌వాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

వేముల‌వాడ (CLiC2NEWS): ఇవాళ కార్తీక సోమ‌వారం పుర‌స్క‌రించుకుని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా రాజేశ్వరుని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు. ఇవాళ వేకువ జాము నుంచే స్వామివారిని ద‌ర్శించుకునేందుకు భక్తుల రద్దీ అధికంగా ఉంది. దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కాగా ఆల‌య అర్చకులు స్వామివారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అలాగే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

 

సోమ‌వారం వేముల‌వాడ రాజన్న ఆలయంలో స్వామి వారి దర్శనానికి భారీ సంఖ్యలో క్యూ లైన్లలో ఉన్న భ‌క్త‌జ‌నం
Leave A Reply

Your email address will not be published.