కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
8వ వేతన కమిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర సర్కార్ ఉద్యోగులకు ఎన్ డి ఎ సర్కార్ శుభవార్త చెప్పింది. దాదాపు కోటి 15 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు.. వేతనాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8 వ వేతన కమిషన్ కు మంగళవారం నాడు మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇప్పుడున్న 7 వ వేతన సవరణ సంఘం కాల పరిమితి 2026తో ముగుస్తోంది. ఈ క్రమంలో గత జనవరిలో 8 వ వేతన సంఘాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. 8 వ వేతన సంఘంపై కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించిన అనంతరం.. ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ 8వ వేతన సంఘం 18 నెలల్లో సిఫారసులు ఇవ్వనుంది.
అయితే ఈ 8వ వేతన సంఘం 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛను దారులకు వేతనాలు, పింఛన్లు ఎంత ఉండాలో కేంద్ర సర్కార్‌కు పలు సూచనలు చేయనుంది.
Also Read: Montha Effects: పలు ప్యాసింజెర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు
[…] […]