India Coroan: కొత్తగా 60వేల కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు రోజురోజుకి దిగి యివస్తున్నది. అలాగే మరణాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 60,753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,98,23,546కు పెరిగింది. కొత్తగా 97,743 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 2,86,78,390 మంది బాధితులు కోలుకున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,647 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు మొత్తం 3,85,137 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం దేశంలో 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి.