ఎపి సిఆర్‌డిఎలో మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ పోస్టులు

AP CRDA: ఎపి క్యాపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌ అధారిటి (ఎపి సిఆర్‌డిఎ) విజ‌య‌వాడ‌లో మేనేజ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. ఒక మేనేజ‌ర్ పోస్టు.. మూడు ఎగ్జిక్యూటివ్ – క‌స్ట‌మ‌ర్ రిలేష‌న్ షిప్ మేనేజ్‌మెంట్ పోస్టులు క‌ల‌వు. ద‌ర‌ఖాస్తుల‌ను జులై 13లోపు పంపించాల్సి ఉంది.

మేనేజ‌ర్ పోస్టుకు నెల‌కు వేత‌నం రూ.45,500 అందుతుంది. సంబంధిత విభాగంలో పిజి (అకౌంటింగ్ / కామ‌ర్స్‌), డిగ్రీ (ఫైనాన్స్‌/ మార్కెటింగ్‌) తో పాటు 5 నుండ 7 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ సిఆర్ ఎం పోస్టుల‌కు నెల‌కు వేత‌నం రూ. 35వేలు అందుతుంది.

ఎంపికైన అభ్య‌ర్థులు విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి ప్రాంతాల్లో ప‌నిచేయ‌వ‌ల‌సి ఉంటుంది. షార్ట్ లిస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. పూర్తి వివ‌రాల‌కు https//crda.ap.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.