అమ‌ర జ‌వాన్ల‌కు ప్ర‌ధాని మోడి నివాళి

ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడి బిపిన్ రావ‌త్ దంప‌తుల‌తో పాటు 11 మంది సైనికాధికారుల పార్థివ దేహాల‌కు నివాళుల‌ర్పించారు. త‌మిళ‌నాడులో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందిన బిపిన్ రావ‌త్ దంప‌తులు, మ‌రో 11 మంది సైనికుల పార్థివ దేహాలు ఢిల్లీకి చేరుకున్నవి. త‌మిళ‌నాడు నుండి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ లోని పాలం ఎయిర్ బేస్‌‌కు తీసుకొచ్చారు. కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, జాతీయ‌భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ ఢోబాల్‌తో పాటు ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ ద‌ళాల అధిప‌తులు, అమ‌రులైన సైనికాధికారుల కుటంబ స‌భ్యులు పార్థివ దేహాల‌కు అంజ‌లి ఘ‌టించారు.

Leave A Reply

Your email address will not be published.