నెల్లూరు జిల్లాలో ఘోర ప్ర‌మాదం..

నెల్లూరు (CLiC2NEWS):జిల్లాలోని సంగం స‌మీపంలో లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆటో సంగం స‌మీపంలోని బీరా పేరు వాగులో కొట్టుకుపోయింది. సంగం స‌మీపంలోని బీరాపేరు వాగుపై ఉన్న‌వంతెన దాటుతున్న ఆటోను ఎదురుగా వ‌చ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో ప‌డిపోయింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో 12 మంది ఉన్నారు. పోలీసులు ,స్థానికులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి ఏడుగురిని వాగులోంచి కాపాడారు. వీరిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగిలిన ఐదుగురు కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.