శబరిమలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
కర్నూలు(CLiC2NEWS): శబరిమలకు 60 కి.మీ దూరంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు . మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారు ఎపిలోని కర్నూలుకు చెందిన వారుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కర్నూల్లోని బుధవారపేటకు చెందిన 11 మంది అయ్యప్ప స్వాములు టెంపోలో శబరిమలకు బయలుదేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.