AP: పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు
ఏలూరు (CLiC2NEWS) :ఓ ప్రైవేటు బస్సు పోలాల్లోకి దూసుకెళ్లింది. ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం పెద్దకామనపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం విద్యార్థులు పాఠశాలకు తరలిస్తున్న క్రమంలో బస్సు స్టీరింగ్ రాడ్డు విరగడంతో.. వాహనం అదుపుతప్పి పోలాల్లోకి దూసుకెళ్లింది.
ప్రమాద సమయంలో వాహనంలో 27 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తప్పక చదవండి: Vijay Deverakonda: ED విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
[…] Also Read: AP: పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూలు బస్… […]
[…] Also Read: AP: పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూలు బస్… […]