Vijay Deverakonda: ED విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం ఇడి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన ఆరోపణల నేపథ్యంలో విజయ్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇడి అధికారులు బెట్టింగ్ యాప్‌లకు ప్రచారంపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రచారానికి తీసుకున్న రెమ్యునరేషన్ తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే ఈ కేసులో పలువురు యాక్టర్లను ఇడి ప్రశ్నించింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌ను విచారించారు. అలాగే ఆగస్టు 11న దగ్గుబాటి రాణాను, ఆగస్టు 13న మంచు లక్ష్మీ విచారణకు హాజరు కావాలని ఇడి అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
తప్పక చదవండి: Uttarkashi Cloudburst: కొనసాగుతున్న గాలింపు చర్యలు
[…] తప్పక చదవండి: Vijay Deverakonda: ED విచారణకు హాజరైన విజయ్ దే… […]