పీసీసీ చీఫ్ పదవికి సిద్ధూ రాజీనామా
చండీగఢ్ (CLiC2NEWS): పంజాబ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు.
మొన్నటిదాకా పట్టుబట్టి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సిఎం పదవి నుంచి దిగిపోయేలా చేసిన సిద్ధూ.. ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.