Jobs: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్‌లో పోస్టులు

Jobs:  టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రిసెర్చ్ (TIFR, Mumbai) ముంబ‌యిలో వివిధ విభాగాల‌లో 35 పోస్టులు క‌ల‌వు. జులై 4వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాల్సి ఉంది.

పోస్టుల వివ‌రాలు:

సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టులు-3
జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు- 1
సైంటిఫ‌క్ అసిస్టెంట్ పోస్టులు – 3
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు -3
సూప‌ర్‌వైజ‌ర్ పోస్టు-1
ట్రేడ్స్‌మెన్ పోస్టులు -8
క్ల‌ర్కు పోస్టులు -8
వ‌ర్క్ అసిస్టెంట్ పోస్టులు- 8
సెక్యూరిటి గార్డు పోస్టులు- 3
ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ -1

పోస్టుల ప్ర‌కారం ఎంపిక జ‌రుగుతుంది. ఆఫీస‌ర్ కేట‌గిరి పోస్టుల‌కు ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ లు నిర్వ‌హిస్తారు. అడ్మిస్ట్రేటివ్ , క్ల‌రిక‌ల్ పోస్టుల‌ను రాత ప‌రీక్ష (written test), స్కిల్ టెస్ట్(skill test) ద్వారా ఎంపిక చేస్తారు. టెక్నిక‌ల్ పోస్టుల‌ను స్కిల్ టెస్ట్(skill test) ఉంటుంది. టెస్టుల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారిని ముందుగా మూడేళ్ళ కాలానికి ఎంపిక చేస్తారు. అభ్య‌ర్థుల ప‌నితీరుని బ‌ట్టి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు వ‌ర‌కు విధుల్లో కొనసాగే అవ‌కాశం ఉంటుంది. 

ప‌ది, ఐటిఐ, డిప్లొమా, బిటెక్ , పిజి విద్యార్హ‌త‌లు క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే, ద‌ర‌ఖాస్తులు పంపించేందుకు చివ‌రి తేదీ జులై 4.

  • సైంటిఫిక్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 28 నుండి 31 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. బిఇ/ బిటెక్ (కంప్యూట‌ర్ సైన్స్ / ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జి)/ మాస్ట‌ర్స్ డిగ్రీ (కెమిస్ట్రి/ బ‌యో కెమెస్ట్రి/ బ‌యాల‌జి/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌) విద్యార్హ‌త‌లు ఉండాలి. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.1,18,110 అందుతుంది. `
  • సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల‌కు సైన్స్ డిగ్రీ (ఫిజిక్స్/ కెమెస్ట్రి) లేదా ఇంజినీరింగ్ డిప్లొమా (కంప్యూట‌ర్ సైన్స్‌/ కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జి/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ) ఉత్తీర్ణ‌త ఉండాలి. రెండే1ళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. వ‌య‌స్సు 33 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. నెల‌కు జీతం రూ.73,020 ఉంటుంది.
  • జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుకు ఎంపికైన వారు నెల‌కు వేత‌నం రూ.73,020 అందుకోవ‌చ్చు. మెకానిక‌ల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉన్న‌వారు ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కంప్యూట‌ర్ పరిజ్ఞానం, రెండేళ్ల ఉద్యోగానుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఉంటుంది. వ‌య‌స్సు 28 ఏళ్లు మించ‌కూడ‌దు.
  • అడ్మిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల‌కు వయ‌స్సు 33 నుండి 36 సంత్స‌రాల మ‌ధ్య ఉండాలి. డిగ్రీ, వ‌ర్డ్ ప్రాసెసింగ్‌/ డేటాబేస్ / అకౌంటింగ్ ప్రొసీజ‌ర్స్ నైపుణ్యం ఉండాలి. దీంతో పాటు ఐదేళ్ల ఉద్యోగానుభ‌వం ఉండాలి.
  • సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుకు హాస్పిటాలిటి మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త అవ‌స‌రం. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ తో పాటు రెండేళ్ల ఉద్యోగానుభ‌వం త‌ప్పిన‌స‌రి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 28 ఏళ్ల లోపు ఉండాలి.
    పై రెండు పోస్టుల‌కు వేత‌నం రూ.73,020 అందుకోవ‌చ్చు.
  • ట్రేడ్‌మ‌న్ పోస్టుల‌కు ప్లంబ‌ర్‌/ ఎల‌క్ట్రిక‌ల్ / వెల్డ‌ర్ / టెక్నీషియ‌న్ మెట్రానిక్స్ / ఎయిర్ కండిష‌నింగ్ ట్రేడ్‌లో నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి. దీంతో పాటు రెండేళ్ల ఉద్యోగానుభ‌వం త‌ప్పిన‌స‌రి లేదా నేష‌న‌ల్ అప్రెంటిస్‌షిప్ స‌ర్టిఫికెట్, ఏడాది ఉద్యోగానుభ‌వం ఉండాలి. నెల‌కు వేత‌నం రూ.46,990 అందుతుంది.సూప‌ర్‌వైజ‌ర్ , ట్రేడ్స్‌మెన్ పోస్టుల‌కు అభ్య‌ర్థుల వ‌య‌స్సు 28 ఏళ్ల‌కు మించ‌రాదు.
  • క్ల‌ర్కు .. ఈ ఉద్యోగాల‌కు డిగ్రీ ఉత్తీర్ణ‌త ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. టైపింగ్‌, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఏడాది పాటు ఉద్యోగానుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్యత ఉంటుంది. వేత‌నం రూ.46,990 ఉంటుంది. వ‌య‌స్సు 28నుండి 31సంవ‌త్సారాల మ‌ధ్య ఉండాలి.
  • వ‌ర్క్ అసిస్టెంట్ పోస్టుల‌కు ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త ఉండాలి. క్యాంటీన్‌/ క్యాట‌రింగ్‌లో సంవ‌త్స‌రం పాటు అనుభ‌వం ఉండాలి. పుడ్ అండ్ బేవ‌రేజ‌స్ లో స‌ర్టిఫికెట్ కోర్సు చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. నెల‌కు వేత‌నం రూ. 36,360 ఉంటుంది. 28నుండి 31సంవ‌త్సారాల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
  • సెక్యూరిటి గార్డు పోస్టులు 3 ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. మూడేళ్ల ఉద్యోగానుభ‌వం ఉండాలి. ఫైర్ ఫైటింగ్ ట్రెయినింగ్ ఫ‌స్ట్ ఎయిడ్ స‌ర్టిఫికెట్ త‌ప్ప‌నిస‌రి.

Job News SBI: 49 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.