శ్రీ సీతారామ స్వామి ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌న టికెట్లు ఆన్‌లైన్‌లో..

 

భ‌ద్రాచ‌లం (CLiC2NEWS): ముక్కోటి ఏకాద‌శి మహోత్స‌వాలు పురస్క‌రించుకొని భ‌ద్రాచ‌లంలో స్వామి వారి ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌న టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. భ‌ద్రాచలం శ్రీ సీతారామ‌చంద్ర స్వామి ఆల‌యంలో 13వ తేదీ వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా స్వామి వారి ఉత్త‌ర ద్వార దర్శ‌నార్థం భ‌క్తుల‌కు ఆన్‌లైన్‌లో టికెట్లు పొంద‌వ‌చ్చ‌ని ఆల‌య అధికారులు సూచించారు. జ‌న‌వ‌రి 12న తెప్పోత్స‌వం, 13న ఉత్త‌ర ద్వార ద‌ర్శ‌నం ఉంటాయ‌ని తెలిపారు. టికెట్ల ధ‌ర‌ల‌ను వివిఐపి నుంచి సామాన్య కోటా వ‌ర‌కు రూ. 2000, 1000, 500, 250గా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్ టికెట్ల‌ను www. bhadrachalamonline.com వెబ్‌సైట్ ద్వారా పొంద‌వ‌చ్చ‌ని తెలియ‌జేశారు.

Leave A Reply

Your email address will not be published.