యుద్ధ ప్రాతిప‌దిక‌న పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌: డి.సిఎం ప‌వ‌న్‌

విజ‌య‌వాడ (CLiC2NEWS): మొంథా తుఫాన్ ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్ర‌భావంతో ప‌లు చోట్లు చెట్లు వ‌రిగిప‌డుతున్నాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోతున్నాయి. దీనిపై జ‌న‌సేన అధినేత‌, ఎపి డిప్యూటీ సిఎం స్పందించారు. తుఫాన్ ప్ర‌భావంతో కూలిన చెట్ల‌ను, విద్యుత్ స్తంభాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌ను ప‌వ‌న్ ఆదేశించారు. మొంథా తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు బుధ‌వారం మొంథా ప్ర‌భావిత జిల్లాల‌కు సంబంధించిన క‌లెక్ట‌ర్ల‌తో విడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మొంథా ప్ర‌భావంపై అధికారును అడిగి తెలుసుకున్నారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాకు త‌ర‌లించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే పున‌రావాస కేంద్రాల్లో ఆహారం, వ‌స‌తి క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. అలాగే వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టాక ప‌రాశుద్ధ్య కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని అధికారుల‌కు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మొథా ఎఫెక్ట్‌తో క‌లిగిన న‌ష్టంపై వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి ప‌వ‌న్ తెలుసుకున్నారు.

Also Read: ప‌ట్టాల‌పైకి వ‌ర‌ద నీరు.. నిలిచిన గోల్కొండ‌, కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు

Leave A Reply

Your email address will not be published.