ఆ గ్రామంలో స్వ‌చ్ఛంధ లాక్ డౌన్!

రంగారెడ్డి జిల్లా: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో మూడు వేల‌కు ద‌గ్గ‌ర‌గా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఇక‌పోతే.. రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామంలో ఈ మ‌ధ్య‌కాలంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ గ్రామంలో 25 కు పైగా కేసులు వెలుగుచూసాయి. దీంతో గ్రామ‌స్తులు, గ్రామంలోని పెద్దలు కరోనా కట్టడికి కోసం ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో స్వచ్చంద లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 20 వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.