తెలంగాణ: మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. రెండు కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎలక్షన్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా, రేపటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగనుండగా, ఉపసంహరణకు 22వ తేదీన తుది గడువు విధించారు. ఇక ఏప్రిల్ 30న పోలింగ్ జరుగనుంది. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కాగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు ఈ నెల 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. జిహెచ్ ఎంసి పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు, గజ్వేల్, నల్లొండ, జల్పల్లి, అలంపూర్, బోదన్, పరకాల, మెట్పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నిక జరుగనుంది.
వివరాలు:
- నామినేషన్ల స్వీకరణ: ఏప్రిల్ 16 నుంచి 18 వరకు
- ఉపసంహరణకు చివరి తేదీ: ఏప్రిల్ 22
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 30
- కౌంటింగ్: మే 3

గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ రిజర్వేషన్లు ఖరారు
గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇవాళ రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వరంగల్ నగర పరిధిలోని 66 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు కాగా, 65వ డివిజన్ ఎస్టీ మహిళకు, 2వ డివిజన్ ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజన్లు ఎస్సీ మహిళలకు, 15, 17, 18, 37, 47, 53 డివిజన్లను ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. 9, 16, 23, 25, 32, 33, 36, 38, 42, 54 డివిజన్లను బీసీ మహిళలకు, 6, 10, 12, 20, 21, 26, 34, 39, 40, 41 డివిజన్లు బీసీ జనరల్‌కు కేటాయించారు. 8, 11, 19, 24, 28, 29, 30, 44, 48, 49, 50, 55, 57, 58, 59, 63 డివిజన్లను జనరల్ మహిళలకు కేటాయించారు.

ఖమ్మం కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ఖరారు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు రిజర్వేషన్ల జాబితాను ఇవాళ విడుదల చేశారు. 1, 8 డివిజన్లు ఎస్టీ జనరల్, 32వ డివిజన్ ఎస్టీ మహిళకు కేటాయించారు. 22, 42, 59 డివిజన్లను ఎస్సీ మహిళలకు, 40, 43, 52, 60 డివిజన్లను ఎస్సీ జనరల్‌కు, 28, 29, 30, 33, 34, 38. 46, 47, 48, 57 డివిజన్లు బీసీ మహిళలకు, 2, 7, 14, 16, 19, 24, 25, 31, 44, 51 డివిజన్లను బీసీ జనరల్‌కు, 5, 9, 10, 11, 12, 15, 17, 18, 20, 21, 37, 53, 54, 55, 56, 58 డివిజన్లను జనరల్ మహిళలకు, 3, 4, 6, 13, 23, 26, 27, 35, 36, 39, 41. 45. 49. 50 డివిజన్లను జనరల్ అభ్యర్థులకు కేటాయించారు.

సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్లు ఖరారు
సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లను అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ రమణ చారి ప్రకటించారు. పట్టణ జనాభా పెరగడంతో ప్రస్తుతం ఉన్న 34 వార్డులను 43 కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మున్సిపాలిటీలో మొత్తం 1,00,658 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 49,880 మంది, మహిళా ఓటర్లు 50,757 మంది , 11మంది థర్డ్ జెండర్ ఉన్నారు.
- 1వ వార్డు జనరల్
- 2వ వార్డు ఎస్సి జనరల్
- 3వ వార్డు జనరల్
- 4వ వార్డు ఓసి మహిళ
- 5వ వార్డు జనరల్
- 6వ వార్డుజనరల్
- 7వ వార్డు జనరల్ మహిళ
- 8వ వార్డు జనరల్ మహిళ
- 9వ వార్డు బిసి జనరల్
- 10వ వార్డు బీసీ మహిళ
- 11వ వార్డు బిసి మహిళ
- 12వ వార్డు బిసి మహిళ
- 13వ వార్డు బిసి జనరల్
- 14వ వార్డు జనరల్ మహిళ
- 15వ వార్డు జనరల్ మహిళ
- 16వ వార్డు బిసి జనరల్
- 17వ వార్డు జనరల్ మహిళ
- 18వ వార్డు బిసి మహిళ
- 19వ వార్డు ఎస్సి జనరల్
- 20వ వార్డు బిసి జనరల్
- 21వ వార్డు జనరల్ మహిళ
- 22వ వార్డు జనరల్
- 23వ వార్డు జనరల్
- 24వ వార్డు బిసి జనరల్
- 25వ వార్డు జనరల్
- 26వ వార్డు ఎస్టీ జనరల్
- 27వ వార్డు జనరల్
- 28వ వార్డు బిసి జనరల్
- 29వ వార్డు బిసి జనరల్
- 30వ వార్డు బిసి మహిళ
- 31వ వార్డు బిసి జనరల్
- 32వ వార్డు బిసి జనరల్
- 33వ వార్డు బిసి మహిళ
- 34వ వార్డు జనరల్ మహిళ
- 35వ వార్డు జనరల్ మహిళ
- 36వ వార్డు జనరల్ మహిళ
- 37వ వార్డు ఎస్సి మహిళ
- 38వ వార్డు జనరల్
- 39వ వార్డు జనరల్
- 40వ వార్డు బిసి జనరల్
- 41వ వార్డు జనరల్
- 42వ వార్డు జనరల్ మహిళ
- 43వ వార్డు బిసి మహిళ