2,17,353 కొత్త‌ కేసులు.. 1185 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. రోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లిస్ట్ లో ఉన్నది. అగ్ర‌రాజ్యంలో ల‌క్ష నుంచి 2 ల‌క్ష‌ల కేసులు పెర‌గ‌డానికి 34 రోజుల స‌మ‌యం ప‌డితే భార‌త్‌లో ప‌దిరోజులే ప‌ట్టింది.

గడిచిన 24 గంటల్లో ఇండియాలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ వెడుద‌ల చేసింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1,25,47,866 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 15,69,743 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1185 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,74,308కి చేరింది.
ఇంత‌కాలం మ‌హారాష్ట్రలో వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండేది ఇప్ప‌టు ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు విస్త‌రిస్తోంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌లో కేఉల సంఖ్య పెరుగూ వ‌స్తోంది.

Leave A Reply

Your email address will not be published.