ఆక్సిడెంట్ కేసులో డ్రైవర్‌కు ఏడాది జైలు శిక్ష..

పెద్దపల్లి (CLiC2NEWS): సుల్తానాబాద్ న్యాయ‌మూర్తి ఆక్సిడెంట్ కేసులో నిందితునికి ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేశారు.
2017 జనవరి 15 తేదీన దుబ్బ‌ప‌ల్లి గ్రామం వ‌ద్ద జ‌రిగిన ఆక్సిడెంట్ కేసులో విచార‌ణల అనంత‌రం  తీర్పు వెలువ‌డింది. పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన ఎర్రం అమరేందర్ రెడ్డి.. దుబ్బపల్లి గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా చిలుక సురేష్ త‌న వాహనంతో ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో అమరేందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆయనను కరీంనగర్‌లోని చలిమడ ఆనందరావు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనపై మృతుడి తండ్రి ఎర్రం నారాయణరెడ్డి ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్‌ఐ బి. జీవన్ నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కేసు విచారణ అనంతరం.. ఈ రోజు సుల్తానాబాద్ న్యాయమూర్తి దుర్గం గణేష్ నిందితుడు చిలుక సురేష్‌కు ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) శ్యాంప్రసాద్ రావు, కోర్టు కానిస్టేబుల్ దేవరాజులను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.