తెలంగాణలో గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ వాయిదా..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసినదే. మొత్తం 25 ప్రభుత్వ విభాగాలకు చెందిన 9,168 పోస్టులను టిఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుండి ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది. అదేవిధంగా కొత్త తేదీలను వెల్లడించింది. డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది.