విహార యాత్రలో ఊహించని విషాదం

వేలేరుపాడు: గ్రామస్తులంతా దసరా ఉత్సవాలలో భాగంగా నిర్వ‌హించిన విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది భూదేవిపేట గ్రామానికి చెందిన వారు మండలంలోని వసంతవాడ పెదవాగు బ్రిడ్జ్‌ సమీపంలో బుధవారం వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ మహిళలంతా వంటా వార్పులో నిమగ్నమవగా.. ఏడుగురు యువకులు పక్కనే ఉన్న పెదవాగులో స్నానానికి దిగారు. లోతుగా ఉన్న ప్రాంతంలో ఏడుగురు యువకుల్లో ఆరుగురు చూస్తుండగానే నీటి మడుగులోకి జారిపోయారు. గ్రామస్తులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేసేలోగా పూర్తిగా నీట మునిగారు. గాలింపు చ‌ర్య‌ల్లో గంగాధర వెంకట్రావు (17) మృతదేహం లభ్యమైంది. శ్రీరాముల శివాజీ (16), పుట్టపర్తి మనోజ్‌ (18), కర్నాటి రంజిత్‌ (21), కెల్లా భువనసాయి (16), కూనవరపు రాధాకృష్ణ (19) మృతదేహాలు లభ్యమయ్యాయయి. ఒకేరోజు 6 కుటుంబాలకు చెం దిన యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. జిల్లా ఎస్పీ నారాయణనాయక్‌, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బాధితులను పరామర్శించారు.

Leave A Reply

Your email address will not be published.