వీధికుక్క‌ల నియంత్ర‌ణ‌కు వారంలోగా క‌మిటి: హైకోర్టు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS):

న‌గ‌రంలో వీధి కుక్క‌ల నియంత్ర‌పై రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం బుధ‌వారం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కుక్క‌ల నియంత్ర‌ణ‌కు వారంలోపు నిపుణుల క‌మిటి వేయాల‌ని జిహెచ్ ఎంసిని ఆదేశించింది.  వీధి కుక్క‌ల దాడిలో బాలుడి మృతిపై దాఖ‌లైన పిల్‌పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ క్ర‌మంలో జిహెచ్ ఎంసికి ఆదేశాలు జారీ చేసింది. ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించేవారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. కేసు త‌దుప‌రి విచార‌ణ జులై 18కి వాయిదా వేసింది.

cabe4d

Leave A Reply

Your email address will not be published.