Anakapalli: ప‌ట్ట‌ప‌గ‌లే బ్యాంకు దోపిడీకి ప్ర‌య‌త్నించిన దుండ‌గులు

అన‌కాప‌ల్లి (CLiC2NEWS): అన‌కాప‌ల్లిలో ప‌ట్ట‌ప‌గ‌లే బ్యాంకు దోపిడీకి ప్ర‌య‌త్నించారు దుండ‌గులు. కానీ.. బ్యాంకు మేనేజ‌ర్ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించ‌డంతో వారు ప‌రార‌య్యారు. అన‌కాప‌ల్లిలోని కెనరా బ్యాంకులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మొత్తం ఏడుగురు వ్య‌క్తులు రెండు వాహ‌నాల్లో బ్యాంకు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. బ్యాంకు లోప‌లికి ఐదుగురు దుండ‌గులు ప్రేవేశించారు. మేనేజ‌ర్‌కు గ‌న్ చూపించి బెదిరించ‌గా.. వెంట‌నే మేనేజ‌ర్ అప్ర‌మ‌త్త‌మై అలారం ప్రెస్ చేయ‌డంతో దుండ‌గులు అక్క‌డినుంది పారిపోయారు. దుండ‌గులు బ్యాంకులోకి ప్ర‌వేశించ‌గానే అక్క‌డున్న సిబ్బంది, ఖాతాదారులు భ‌యాందోళ‌న‌కు లోన‌య్యారు.  స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. సిసిటివి పుటేజి ఆధారంగా దుండ‌గుల కోసం గాలింపు చేప‌ట్టారు.

Also Read: Tandur: క‌ట్నం కోసం భార్య‌ను హ‌తమార్చిన భ‌ర్త

1 Comment
  1. […] Anakapalli: ప‌ట్ట‌ప‌గ‌లే బ్యాంకు దోపిడీకి ప… […]

Leave A Reply

Your email address will not be published.